Great inspirational Story of "ANDRHUDU"
పాసైంది పదే.. కానీ మైక్రోసాఫ్ట్లో చీఫ్ యాప్ ఆర్కిటెక్ట్ అయ్యాడు..! అదీ ఓ తెలుగోడి సత్తా:: చదువుకు.. జ్ఞానానికి సంబంధం లేదు. చదువు జ్ఞానం, సంస్కారం ఇవ్వొచ్చేమో కానీ.. కొంత మంది విభిన్నమైన వ్యక్తులకు అదే జీవితం కాకపోవచ్చు. ఏదో ఒకటి చేయాలనే పట్టుదల, ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలనే బలీయమైన కాంక్ష కొంత మందిని ఎంత దూరానికైనా తీసుకెళ్తుంది. ఇప్పుడు మీరు తెలుసుకోబోయే వ్యక్తి కూడా అలాంటివాడే. చదివింది కేవలం పదో తరగతి.. అవును మీరు వింటున్నది ముమ్మాటికీ నిజమే. కానీ.. అతడి కంప్యూటర్ పరిజ్ఞానాన్ని కొలిచేందుకు సాధనాలేవీ లేవు. తనకు ఇష్టమైన..రంగంలో అతడు ఆరితేరాడు. ఆ పట్టుదల ముందు చదువు కూడా చిన్నపోయింది. ప్రపంచ ప్రఖ్యాత మైక్రోసాఫ్ట్ కూడా.. అతడి టాలెంట్ను చూసిందే కానీ.. కాగితాల్లో ఉండే మార్కులను చూసి బేరీజు వేయలేకపోయింది. పదో తరగతి క్వాలికేషన్ అనే ట్యాగ్ పక్కనపడేసి.. పీజీలు, పిహెచ్డీలు చేసిన వాళ్లను కాదని.. ఉద్యోగంలోకి ఆహ్వానించింది. చివరకు తమ సంస్థలో అత్యున్నతంగా భావించే యాప్ ఆర్కిటెక్ట్ టీంలో ఉన్నతాసనం వేసి కూర్చోబెట్టింది. ఆ వ్యక్తే కోటిరెడ్డి. క్రిష్ణాజిల్లా వాసి. మై