Skip to main content

The First Festival in All Festivals.....Let's Enjoy Festivals...

పండుగలకు శుభారంభం.. తొలి ఏకాదశి..!!
శాంతాకారం భుజగశయనం, పద్మనాభం, సురేశం 
విశ్వాకారం, గగన సదృశం మేఘవర్ణం శుభాంగం 
లక్ష్మీకాంతం, కమలనయనం యోగి హృద్ధ్యానగమ్యం 
వందే విష్ణుం, భవభయహరం సర్వలోకైక నాధం. 

 ప్రతీసంవత్సరం ఆషాడ శుద్ధ ఏకాదశిని 'తొలిఏకాదశి' గా అంటారు. ఎందుచేతనంటే! పూర్వకాలమందు ఈ తోలిఏకాదశితోనే, సంవత్సర ప్రారంభంగా కూడ చూచేవారట! ఈ రోజును 'శయన ఏకాదశి' అనికూడా పిలుస్తారు ఎందువల్లననగా; శ్రీమహావిష్ణువు ఆరోజునుండి కార్తీకశుద్ధ ఏకాదశి వరకు యోగనిద్రలో ఉంటాడని, నాటినుండి శ్రీహరిభక్తులు కామక్రోధాధులు వర్జించి ప్రయాణాలు చేయకుండా ఒకేచోట ఉండి శ్రీహరిని అర్చిస్తూ తిరిగి కార్తీకశుద్ధ ఏకాదశి 'ఉత్థాన ఏకాదశి' వరకు ఆనాలుగు మాసములు చాతుర్మాస్య వ్రతం చేయుట కూడా మన భారతీయ సంప్రదాయములలో ఒకటి. ఆరోజు 'శ్రీహరి' శేషతల్పం పైనుండి మేల్కొంటాడు. ఈ చాతుర్మాస్య దీక్షను సన్యాసులు మాత్రమేకాదు. సంసారులు, వయో, లింగబేధము లేకుండా భక్తులందరూ దీనిని ఆచరిస్తూ ఉంటారు. 

శేషతల్పం శ్రీహరి

పండుగలకు శుభారంభం.. తొలి ఏకాదశి..!!

ఈ 'తొలి ఏకాదశి' నాడు "గోపద్మ వ్రతం" చేయుట ఎంతో విశిష్టమైనదిగా చెప్తారు. మన భరతభూమి పుణ్య భూమి. భక్తికి, భక్తి తత్వానికి పుట్టినిల్లు. అచంచలమైన భక్తి విశ్వాసాలతో భగవదారాధన చేసి, దైవానుగ్రహాన్ని పొందేందుకు, మన పూర్వులు నియమించిన కొన్ని పర్వ దినాలలో, ఏకాదశి వొకటి. తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, భీష్మ ఏకాదశి అని జరుపుకోవడం మన ఆచారంగా వ్యవహరింపబడుతోంది. మన భరతభూమి పుణ్య భూమి. భక్తికి, భక్తి తత్వానికి పుట్టినిల్లు. అచంచలమైన భక్తి విశ్వాసాలతో భగవదారాధన చేసి, దైవానుగ్రహాన్ని పొందేందుకు, మన పూర్వులు నియమించిన కొన్ని పర్వ దినాలలో, ఏకాదశి వొకటి. తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, భీష్మ ఏకాదశి అని జరుపుకోవడం మన ఆచారంగా వ్యవహరింపబడుతోంది. 
ఏకాదశి రోజున కర్షకులు పూజ పూర్తయిన తర్వాత పొలానికి వెళ్ళి పని చేసుకుంటారు. ఈవేళ తప్పనిసరిగా పని చేయాలనే నమ్మకం ఉంది. కొత్త కూలీలను మాట్లాడ్డం లాంటి పనులు ఏమైనా ఈవేళ చేస్తారు. వాళ్ళను ఈవేళ పనిలోకి రమ్మని ప్రత్యేకంగా చెప్తారు. కొత్త ఒప్పందాలు ఏవైనా ఈవేళ కుదుర్చుకుంటే మంచిదని నమ్మి అలా చేస్తారు. మరే మార్పుచేర్పులు అయినా ఈ తొలి ఏకాదశినాడు చేపడతారు.  తొలి ఏకాదశి పండుగ నాడు మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి, అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి, ప్రసాదంగా తీసుకుంటారు. తొలి ఏకాదశినాడు ఈ పేలప్పిండిని తప్పకుండా తినాలని విశ్వసిస్తారు.  సంక్రాంతి, దసరా లాంటి పెద్ద పండుగాల్లాగే తొలి ఏకాదశిని ముఖ్యమైన పండుగ దినంగా భావించి, ఉపవాసం ఉంటారు. ఈవేళ ఉపవాసం కనుక గారెలు, బూరెలు లాంటి పిండివంటలు ఏమీ చేయరు. కొందరు నేతితో పాయసం వండి ప్రసాదంగా పంచుతారు. పండ్లు మాత్రమే సేవిస్తారు. తొలి ఏకాదశి ,ఆషాఢ శుద్ధ ఏకాదశి,శయన ఏకాదశి,ప్రధమ ఏకాదశి. ఇంత పుణ్యప్రదమైన తొలిఏకాదశి పర్వదినం శుభప్రదముగా జరుపుకుని పునీతులౌదాము.

Comments

Popular Posts