Monday 21 September 2015

Photo Change the "World"

ఒక ఫోటో ప్రపంచాన్ని మార్చింది
కెమెరా దృశ్యాన్ని బంధిస్తుంది.. ఆ దృశ్యం అందమైంది కావొచ్చు.. ఉల్లాసపరిచేది కావొచ్చు.. ఆకట్టుకునేది అవ్వొచ్చు.. కానీ గుండెలో తడి ఉన్న ప్రతి హృదయాన్ని కన్నీరు పెట్టించే దృశ్యాలు మాత్రం అరుదుగానే ఉంటాయి. కేవలం ఫొటోలతో ప్రపంచాన్ని కదిలించి, చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన చిత్రాలు ఇటీవల రెండు ఫేస్‌బుక్‌లో ప్రత్యేకంగా నిలిచాయి. ఇవే కాకుండా చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా చాలానే ఉన్నాయి.అవన్నీ మరుగను పడిపోయాయి..ప్రపంచం మరచిపోయిన చిత్రాలను మళ్లీ ఓ సారి గుర్తు చేసుకుందాం.
                  


.     డాడీ నీ కోసం ఎదురుచూస్తున్నానంటూ చిన్న పిల్లాడు పరిగెడుతున్న చిత్రం.యుద్ధంలోకి వెళుతున్న చాలామందికి ఈ చిత్రం చూసిన తరువాత ఎంతో వేదన కలిగే ఉంటుంది. తన పిల్లల మీద ప్రేమను చూపెడుతోంది. యుద్ద పరిస్థితులను కూడా కళ్లకు కట్టినట్టు చూపే ఈ చిత్రాన్ని డెట్లాఫ్ తీసారు.


ప్రపంచాన్నికి ఉద్యమం అంటే ఏంటో తెలియజెప్పిన చెగువేరా చివరిక్షణంలో ఇలా నేలకొరిగినప్పుడు తీసిన చిత్రం ఇది. దీనికి అందరూ చే లైవ్స్ అని స్లోగన్ కూడా ఇచ్చారు.


జర్మనీలో గల బెర్గిన్ లోని క్యాంప్ శిబిరంలో సైనికుల శవాల మధ్య ఓ డాక్టర్ దీనంగా నడుస్తున్న చిత్రం. ఈ శవాలను ఓ చోటుకు చేర్చి తగలబెట్టడం ఇతని ప్రధాన విధి..ఇలా కుప్పలు కుప్పలుగా పడి ఉన్న శవాలను చూసిన యావత్ ప్రపంచం నివ్వెరబోయింది. ఈ చిత్రం ప్రపంచాన్నే మార్చి వేసింది.


యూరప్‌ ద్వంద్వ ప్రమాణాల్ని ప్రపంచానికి తెలియజేసిన చిత్రం అది. అదే సముద్రతీరాన చనిపోయి పడివున్న బాలుని చిత్రం.నీలోఫర్‌ డెమిర్‌ అనే పాత్రికేయురాలు తన కెమెరాలో ఈ చిత్రాన్ని బంధించింది. ఈ చిత్రం సొంత ఊరు, కన్నవారినీ వదిలి చేతబట్టుకుని పొరుగు దేశాలకు వెళ్లే శరణార్థుల వెతల్ని చూపెడుతోంది. ఈ ఫొటో చూసి ఇప్పటికే కోటాను కోట్ల మంది కన్నీరు పెట్టి ఉంటారు.


ఆకలితో బక్కచిక్కిన శరీరం, ఎముకల గూడుగా మారి తల వంచిన చిన్నారి.. చనిపోతే బాగుండు తినేద్దాం అని ఎదురుచూసే రాబందు.. ఈ చిత్రం చూస్తే ఎంత కరడుగట్టిన వారినైనా కదలిస్తుంది. సూడాన్‌లో నాటి కరువు పరిస్థితులకు అద్దం పట్టిందీ చిత్రం. ఈ చిత్రాన్ని కెవిన్‌ కార్టర్‌ అనే ఫొటోగ్రాఫర్‌ తన కెమెరాతో 1993లో చిత్రీకరించారు. అయితే ఆ బాలుడిని రక్షించకుండా కెవిన్‌ వచ్చేశాడు. ఆ తర్వాత కెవిన్‌కు మంచి కానుకే లభించింది. కానీ అతను తీవ్ర విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ బాలుడిని రక్షించలేదన్న బాధతోనే కెవిన్‌ కొన్ని నెలల తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు.


అతిపెద్ద పారిశ్రామిక దుర్ఘటనల్లో బోపాల్‌ గ్యాస్‌ ఉదంతం ఒకటి. 1984లో యూనియన్‌ కార్బైడ్‌ ఇండియా లిమిటెడ్‌ ఫ్యాక్టరీ నుంచి మిథైల్‌ ఐపోసైనేట్‌ అనే విషవాయువు లీకవటం వల్ల సుమారు 15 వేల మంది ప్రజలు చనిపోయారు. ఐదు లక్షల మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ దుర్ఘటనలో చనిపోయిన తన కొడుకుని ఓ తండ్రి పూడ్చిపెడుతున్నప్పుడు తీసిన చిత్రం ఇది. ఆ దుర్ఘటనకు ప్రతిరూపంగా నిలిచింది. నాటి పరిస్థితుల్ని ప్రతింబించేలా నేటికీ సజీవ తార్కాణంగా ఉందా చిత్రం.


డబ్ల్యుటివోపై ఆల్‌ఖైదా ఉగ్రవాదులు విమానాలతో డీ కొన్నప్పటి సంఘటనకు సంబంధించిన చిత్రమిది. తన స్వార్థ ప్రయోజనాల కోసం సామ్రాజ్యవాద దురంహకారంతో ఇతరదేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుని, చిచ్చుపెట్టి, ఆ భస్మాసుర హస్తం చివరకు తనకెలా చుట్టుముట్టిందో ఈ చిత్రమే చెబుతోంది. అది 2001, సెప్టెంబర్‌ 11. న్యూయార్క్‌లోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ ట్విన్‌ టవర్లను ఉగ్రవాదులు పకడ్బందీ వ్యూహంతో విమానాలతో కూల్చేసి, అమెరికా గుండెల్లో దడపుట్టించారు. ఈ దుర్ఘటనలో సుమారు మూడు వేల మంది ప్రజలు చనిపోయారు. వారంతా తమ ప్రాణాలను కాపడుకోవడం కోసం ఇలా అంత ఎత్తు నుంచి కిందికి దూకారు.


. ఈ చిత్రం కూడా పులిట్జర్ అవార్డును అందుకుంది. మిలిటరీ బలాలతో ఓ సాధారణ మహిళ యుద్దం చేస్తున్నప్పటి చిత్రం.ఫిబ్రవరి 2006 ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధ సమయంలో తీసారు




మైక్ వెల్స్ తీసిన చిత్రం. ఉగాండాలో కరువు ఏ స్థాయిలో ఉందో ఇట్టే కళ్లకు కడుతున్న చిత్రం.



                                      ఆఫ్రికాలో వర్ణ వివక్షను కళ్లకు కట్టినట్లు చూపే చిత్రం ఇది



బియాఫ్రాలో 1969లో జరిగిన యుధ్దంలో జరిగిన పరిణామాన్ని కళ్లకు కట్టే చిత్రం. 3 సంవత్సరాల పాటు యుద్ధంలో నలిగిపోయారు. దాదాపు 900 మంది చిన్నారులు తినడానికి తిండి లేక ఇలా బక్కచిక్కిపోయి చావు అంచులదాకా చేరారు.


వియాత్నాంలో క్యాథలిక్ లకు బుద్ధులకు మధ్య సాగిన యుద్ధానిని నిలువెత్తు సాక్ష్యం ఇది.


 పెన్సిల్వేనియా లో పుస్తకాలు పట్టుకోవాల్సిన పాలబుగ్గల చిన్నారులు కోల్ మైన్ లోకి పనికి వెళుతుంటే హైన్ ఈ చిత్రాన్ని క్లిక్ మనిపించారు. అక్కడి చిన్న పిల్లల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఈ చిత్రం కళ్లకు కట్టినట్లు బయటి ప్రపంచానికి చూపించింది.


వియాత్నాం వార్ జరుగుతున్న సమయంలో ఓ మహిళ సైనికులకు మీరు పట్టుకోవాల్సింది గన్ లు కాదు పూలు పట్టుకోండి చూపింది. ఈ చిత్రం తరువాత ఫ్లవర్        పవర్ మూవ్ మెంట్ కు సింబల్ గా మారింది. దీన్ని మార్క్ తీశారు.
For More Pictures:Touch the Reality..--CV@

1

Great inspirational Story of "ANDRHUDU"

పాసైంది పదే.. కానీ మైక్రోసాఫ్ట్లో చీఫ్ యాప్ ఆర్కిటెక్ట్ అయ్యాడు..! అదీ ఓ తెలుగోడి సత్తా::  చదువుకు.. జ్ఞానానికి సంబంధం లేదు. చదువు జ్ఞానం...